Saturday, April 27, 2024

యువ‌తి కిడ్నాప్‌ కేసులో మ‌లుపు.. సేఫ్‌గా ఉన్న‌ట్టు త‌ల్లిదండ్రుల‌కు ఫోన్‌

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్​కి చెందిన ఓ యువతి ఇవ్వాల కిడ్నాప్​నకు గురయ్యింది. మధ్యాహ్నం నుంచి టెన్షన్‌ పెట్టిన ఆదిభట్ల యువతి కిడ్నాప్‌ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. యువతి కిడ్నాప్‌న‌కు గురైన కొద్దిగంటల్లోనే నిందితుడు నవీన్‌ రెడ్డిని పట్టుకున్నారు. నవీన్‌ రెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన‌ట్టు తెలుస్తోంది. బాధితురాలు వైశాలి సేఫ్‌గా ఉన్న‌ట్టు త‌ల్లిదండ్రుల‌కు కాల్ చేసి చెప్పింది. అయితే.. ఫోన్ కాల్ మాట్లాడుతుండ‌గానే కాల్ క‌ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఆ త‌ర్వాత స్విచ్ ఆఫ్ రావ‌డంతో వారు ఆందోళ‌న చెందుతున్నారు.

కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్‌
నిందితులను అరెస్టు చేయడానికి ముందు కిడ్నాపైన యువతి తన తండ్రి ముచ్చర్ల దామోదర్‌రెడ్డికి ఫోన్‌ చేసింది. తాను సిటీలో ఉన్నానని తెలిపింది. తాను క్షేమంగానే ఉన్నానని.. తన గురించి ఆందోళన చెందవద్దని పేర్కొంది.

అసలేమైందంటే..
రాగన్నగూడకు చెందిన ఓ యువతి బీడీఎస్‌ పూర్తి చేసింది. ఆమెకు ఇంట్లో పెండ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం పెండ్లి చూపులు ఏర్పాటు చేయగా.. నవీన్‌ రెడ్డి అనే యువకుడు రెండొంద‌ల మంది యువకులతో కలిసి ఆ యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం ఆమెను బలవంతంగా లాక్కెళ్లిన‌ట్టు బాధిత యువ‌తి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. కొద్దిగంటల్లోనే నిందితులను అరెస్టు చేసిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement