Sunday, April 28, 2024

మ‌రోసారి వాయిదా ప‌డిన మేజ‌ర్ – జూన్3న రిలీజ్

వాయిదా మీద వాయిదా ప‌డుతూ వ‌స్తోంది మేజ‌ర్ చిత్రం. కాగా మేజ‌ర్ చిత్రం కొత్త రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు చిత్ర మేక‌ర్స్ ..హీరో అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని మే 27న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లోనే అదే రోజున ప్రేక్ష‌కుల‌ ముందుకు ఈ సినిమా వస్తుందని నిర్మాతలు అన్నారు. అయితే అదే తేదీన వెంకటేశ్‌, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ మూవీ సైతం విడుదల అవుతోంది. దాంతో ‘మేజర్’ను ఇప్పుడు ఓ వారం పోస్ట్ పోన్ చేసి జూన్ 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. జూన్ 3న కూడా ‘మేజర్’కు దేశ వ్యాప్తంగా గట్టి పోటీ ఉండబోతోంది. ఇప్పటికే జూన్ 3న అజయ్ దేవ్ గన్ ‘మైదాన్’ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. అలానే అక్షయ్ కుమార్ హీరోగా చంద్రప్రకాశ్ ద్వివేది రూపొందించిన ‘పృథ్వీరాజ్’ మూవీ సైతం అదే తేదీన విడుదల కాబోతోంది. దీన్ని కూడా ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తామని అంటున్నారు. ఇక కమల్ హాసన్ సొంత బ్యానర్ లో రూపుదిద్దుకున్న యాక్షన్ డ్రామా ‘విక్రమ్’ సైతం జూన్ 3నే రిలీజ్ అవుతోంది. సో… కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళ భాషల్లోనూ ‘మేజర్’ కు పోటీగా పలు చిత్రాలు విడుదల కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement