Saturday, April 27, 2024

ల‌క్కీమ్యాన్‌.. జ‌ర్రంత‌ల మిస్స‌య్యిండు.. లేకుంటే అయిపోయెటోడే (వీడియో చూడండి)

బైకుపై స్పీడ్‌గా వ‌చ్చిన ఓ వ్య‌క్తి చావుకు ద‌గ్గ‌రిదాకి వెళ్లిన‌ట్టుంది ఈ ఘ‌ట‌న‌.. అస‌లు ఎంత ల‌క్కీ కాకుంటే.. జ‌ర్రంత‌ల‌నే మిస్స‌య్యింది యాక్సిడెంట్‌.. ఈ వీడ‌యో చూస్తేనే అర్థ‌మ‌యితాంది.. త‌డిసిపోయి ఉంటుంద‌ని..

రోడ్డుపై యూటర్న్​ తీసుకుంటున్న బస్సును ఢీకొట్టబోయి కాస్తలో తప్పించుకున్నాడు ఓ వ్య‌క్తి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన క‌ర్నాట రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ఎలియరుపాడవు ప్రాంతంలో జరిగింది. స్కూటీపై వేగంగా దూసుకొస్తున్న క్రమంలో మూలమలుపు వద్ద ఓ బస్సు యూటర్న్​ తీసుకుంది. దాన్ని తప్పించుకునే క్రమంలో నియంత్రణ కోల్పోయి.. బైక్​ను రోడ్డు కిందకు దించి, పక్కనే ఉన్న దుకాణం, చెట్ల మధ్యలోంచి దూసుకెళ్లాడు. అతని వద్ద హెల్మెట్ ఉన్నా..​ తలకి పెట్టుకోకుండా బైక్​ నడపటం గమనార్హం. ఇందంతా కేవలం 15 సెకన్లలోనే జరిగిపోయింది. హెల్మెట్​ కింద పడిపోయినా ఆగకుండా వెళ్లిపోయాడు. స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement