Thursday, April 25, 2024

దీనులకు అండగా దీవెన ఫౌండేషన్ : ఖాకీ కాఠిన్యం నుండి కరుణహస్తాలు

పాయకాపురం : ధీనులకు అండగా కృష్ణా జిల్లా విజ‌య‌వాడ న‌గ‌రం, పాయ‌కాపురం ఏరియాలో దీవెన ఫౌండేషన్ స్థాపించింబడింది. ఖాకీ కాఠిన్యం నుండి కరుణ హస్తాలు దీనుల కన్నీరు తుడుస్తున్నాయి. దీవెన ఫౌండేషన్ స్థాపించబడి సుమారు రెండున్నర సంవత్సరములు కావస్తున్నది. కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న కె.నాగరాజు దీవెన ఫౌండేషన్ కు ఆర్గనైజర్ గా ఉంటున్నాడు. చిన్నతనం నుండి సేవపట్ల మక్కువ… పుట్టిన ప్రాంత పరిస్థితులు ప్రభావం మరేమో కారణం కావచ్చు కానీ చిన్న నాటి నుండి సేవ పట్ల అధిక ఆలోచనలతో పెరిగినట్లు కె.నాగరాజు తెలుపుతున్నాడు.


దీవెన దివ్యంగురాలి స్ఫూర్తితో….
కానిస్టేబుల్ నాగరాజు ఇంటి పరిసరాలలో ఉండే దీవెన అనే దివ్యాంగురాలు స్ఫూర్తితో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని తెలిపాడు. ఆ దివ్యాంగురాలుకు అన్నీ మంచంపై కుటుంబ సభ్యులు సేవ చేస్తూ ఉండటం చూచి, చలించిపోయి దీవెన ఫౌండేషన్ స్థాపించానని నాగరాజు అంటున్నాడు.


ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు..
పత్రికలు, సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా ఎవరికైనా అనారోగ్య ఇబ్బందులు తెలిస్తే దీవెన ఫౌండేషన్ ద్వారా వారికీ ఆర్ధిక సహకారం అందించడంలో ఫౌండేషన్ ముందుంటున్నది. వెలగలేరు గ్రామానికి చెంది ధీర్ఘకాళిక వ్యాధితో బాధపడుతున్న విలేకరికి, సుమారు 25సంవత్సరాల నుండీ మంచంపై ఉంటున్న పాయకాపురం ప్రాంతంకు చెందిన వ్యక్తికి, గుణదల, అయోధ్య నగర్ ప్రాంతాలకు చెందిన పలువురు క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నవారికి దీవెన ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించింది. దీవెన ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 70 మంది చిన్నారులకు గుండె సంబంధిత వ్యాధులకు, మెదడు వాపు వ్యాధి పిల్లలకు సహాయం చేయడం జరిగినది. క్యాన్సర్ పేషెంట్లకు, వృద్ధులకు, వికలాంగులకు, కరోనాతో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం జరిగినది. లాక్ డౌన్ సమయంలో రోజుకి 350 మంది చొప్పున 45 రోజులు వివిధ ప్రాంతాల్లో పేదలకు భోజనములు పంపిణీ చేయడం జరిగిందని నాగరాజు తెలుపుతున్నారు.

- Advertisement -


తోటి ఉద్యోగస్తుల సహకారం మరువలేనిది….
దీవెన ఫౌండేషన్ లో సుమారు 200మంది సభ్యులుగా ఉన్నారు. వారు వివిధ వర్గాలకు చెందిన వారుగా ఉన్నారు. ఫౌండేషన్ నుండి సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ ముందుంటారు. ఎప్పుడు ఖాకీ యూనిఫామ్ తో బిజీగా వుండే తోటి సహచరుల తోడ్పాటు ఎనలేనిది. క్రింది స్థాయి నుండి ఉన్నతాధికారుల సహకారంతో దీవెన ఫౌండేషన్ పలువురికి సహాయ సహకారాలు అందిస్తున్నది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదుటవారికి సహాయ పడాలన్నదే తన తపన అని నాగరాజు తెలుపుతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement