Wednesday, May 15, 2024

Big Story: లోకాయుక్త చట్ట సవరణకు ఆర్డినెన్స్​.. వద్దంటూ విపక్షాల ఆందోళన..

కేరళలోని లెఫ్ట్​ ప్రభుత్వం రాష్ట్ర లోకాయుక్త చట్టాన్ని సవరిస్తూ ప్రతిపాదించిన ఆర్డనెన్స్​కు సమ్మతి ఇవ్వొద్దని కోరుతూ అక్కడి ప్రపతిపక్ష యునైటెడ్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​ (యూడీఎఫ్​) ఈ రోజు రాజ్​భవవన్​లో గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ ఖాన్​ను కలిసింది. ఈమేరకు గవర్నర్​కు మోమోరాండం సమర్పించింది. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ నేతృత్వంలోని ఫ్రంట్ నాయకులు సవరణకు సంబంధించిన ఆందోళన వెలిబుచ్చారు. ఈ సవరణను తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన సమర్థనలు  పనికిమాలినవిగానూ, పాలిటిక్స్​ కోసమేనని, దేశంలో ఉన్న చట్టాలకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయని సతీశన్ తమ మెమోరాండంలో ఆరోపించారు.

“ఈ ఆర్డినెన్స్ లో ఎగ్జిక్యూటివ్ 22 సంవత్సరాలుగా అమలులో ఉన్న శాసనాన్ని రాజ్యాంగ విరుద్ధమని బహిరంగంగా ప్రకటిస్తోంది. నిబంధనను మార్చడానికి ఆర్డినెన్స్ ను ప్రతిపాదిస్తోంది. ఇది తీవ్ర వైరుధ్యం,  భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధం అని UDF నేతలు చెబుతున్నారు.   వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు జరగనుండగా, 22 ఏళ్లుగా అమలులో ఉన్న చట్టాన్ని మార్చడానికి ఎటువంటి బలమైన కారణం కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.   రిలీఫ్ ఫండ్ దుర్వినియోగంలో ముఖ్యమంత్రిపై, యూనివర్సిటీ సమస్యలో ఉన్నత విద్యాశాఖ మంత్రిపై లోకాయుక్త కేసులు ఎత్తేయడం ఒక్కటే తక్షణ కారణాన్ని గుర్తించగలదని వారు ఆరోపిస్తున్నారు.

ఈ కేసులలో ప్రభుత్వం అనుకూల తీర్పును ఆశిస్తున్నదని,  లోకాయుక్త అవాంఛనీయ నిర్ణయాల నుండి రక్షణ కల్పించడానికి ఈ ఆర్డినెన్స్ రక్షణ కవచమని వారు భావిస్తున్నారన్న విషయం అర్థం చేసుకోవాలని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా, ప్రతిపాదిత సవరణ విపరీతమైన అవినీతి,  ఆశ్రిత పక్షపాతానికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.  

కాగా, రాజ్‌భవన్ వెలుపల విలేకరులతో వారు మాట్లాడుతూ.. గతంలో గవర్నర్‌కు తాను రాసిన లేఖకు కొనసాగింపుగా ఈ మెమోరాండం ఇచ్చామని, ప్రస్తుత లేఖలో అటువంటి ఆర్డినెన్స్ ను ఆమోదించడానికి వ్యతిరేకంగా చట్టపరమైన అంశాల గురించి వివరణాత్మక సూచనలు ఉన్నాయని చెప్పారు. ఆర్డినెన్స్ లోని వివాదాస్పద నిబంధన లోకాయుక్త చట్టం, 1999 యొక్క అసలైన బిల్లులో భాగమని, దీనిని మొదటిసారిగా మార్క్సిస్ట్ పార్టీ సీనియర్ ఇ కె నాయనార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రవేశపెట్టారని తెలిపారు.

లోకాయుక్తపై సీపీఐ(ఎం) ఏం చెబుతోందంటే..

కేరళలోని సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం మంగళవారం లోకాయుక్త చట్టాన్ని సవరించాలనే తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. సహజ న్యాయాన్ని నిర్ధారించడానికి,  రాజ్యాంగం, లోక్‌పాల్,  ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి చట్టాలకు అనుగుణంగా ఉండేలా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, ఇది అంబుడ్స్ మన్ అధికారాలను ‘అణగదొక్కడం’, అవినీతిని సులభతరం చేయడం అని ప్రతిపక్షం ఆరోపించింది. అయితే విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఆర్డినెన్స్ ను జారీ చేయడం ఆకస్మిక నిర్ణయం కాదని, గత ఏప్రిల్‌లో గత ప్రభుత్వ హయాంలో ప్రక్రియ ప్రారంభమైందని న్యాయశాఖ రాష్ట్ర మంత్రి పి రాజీవ్ అన్నారు. లోకాయుక్తకు తప్పనిసరి అధికార పరిధి లేదని, కేవలం సిఫార్సు అధికార పరిధి మాత్రమే ఉందని రెండు హైకోర్టు తీర్పుల దృష్ట్యా కొత్త చట్టాన్ని రూపొందించాలనే సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని కూడా ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement