Saturday, April 27, 2024

లాక్ డౌన్ పెట్టం – థ‌ర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు సిద్ధం – వైద్య‌శాఖ మంత్రి ‘విశ్వాస్ సారంగ్’

క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో ప‌లు రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూ, మ‌రికొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ మేర‌కు స్కూల్స్ , జిమ్స్ , సినిమాహాల్స్ ని మూసేస్తున్నారు. కాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో లాక్ డౌన్ విధించే ఆలోచ‌న లేద‌ని , అలాంటి ప్ర‌తిపాద‌న ఏమీ లేద‌ని రాష్ట్ర హోం మినిస్ట‌ర్ న‌రోత్త‌మ్ మిశ్రా తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ ధ‌రించ‌క‌పోతే ఇప్పుడు విధిస్తున్న జ‌రిమానాను ప్ర‌భుత్వం పెంచ‌నుంద‌న్నారు. క‌రోనా నిబంధ‌న‌ల‌ను తూ.చ త‌ప్ప‌కుండా పాటించాల‌ని అన్నారు. మాస్క్ ధ‌రించ‌డంతో పాటు భౌతిక‌దూరం కూడా ఎంతో ముఖ్య‌మ‌ని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌తీ ఒక్క‌రూ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల‌ని వైద్య, విద్యా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ అన్నారు. గడిచిన 24 గంటల్లో 1,033 కొత్త కోవిడ్-19 కేసులు నమోద‌య్యాయి.

ఈ మేర‌కు ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే రూ.200 జ‌రిమానా విధిస్తామ‌ని తెలిపారు. “గత 24 గంటల్లో 594 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కోవిడ్ (COVID ) ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాల‌ని కోరుతున్నాం. ‘రోకో టోకో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారిపై రూ.200 జరిమానా విధించాలని నిర్ణయించాం. ఇతర జిల్లాల్లో కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చూసుకుంటున్నాం” అని ఆయ‌న అన్నారు. మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని అన్నారు. ప్రైవేటుతో పాటు అన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో మౌళిక స‌దుపాయాలు మెరుగుప‌ర్చామ‌ని అన్నారు. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం వేగంగా చేప‌డుతున్నామ‌న్నారు. 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌కు టీకాలు వేస్తున్నామ‌ని తెలిపారు. పెరుగుతున్న క‌రోనా కేసుల‌ను, ప్ర‌స్తుత ప‌రిస్థితిని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స‌మీక్షించార‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా కరోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం నుండి మ‌రిన్ని ఆంక్ష‌లు విధించింది. వివాహాలకు హాజ‌రయ్యే వారి సంఖ్య 250కి ప‌రిమితం చేసింది. అంత్యక్రియ‌ల‌కు హాజ‌ర‌య్యే వారి సంఖ్య‌ను 50కి ప‌రిమితం చేసింది. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిని సీఎం స‌మీక్షించిన త‌ర‌వాత ప్ర‌భుత్వం ఈ మేర‌కు ఉత్త‌ర్వుల జారీ చేసింది. అంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement