Sunday, May 5, 2024

లైగ‌ర్ ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న – సోనీ మ్యూజిక్

ప్ర‌ముఖ ఆడియో లేబుల్స్ లో ఒక‌టైన సోనీ మ్యూజిక్ 14కోట్ల‌క‌కు లైగ‌ర్ చిత్రం ఆడియో రైట్స్ ని సొంతం చేసుకుంది.ఈ చిత్రంలో
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంట‌గా న‌టిస్తున్నారు. కాగా ఈ మూవీని పూరి జగన్నాథ్ తెర‌కెక్కిస్తున్నారు..స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.మైక్ టైసన్ ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తండ్రిగా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. లైగర్ ” సినిమా ఆగస్టు 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను, ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement