Saturday, May 18, 2024

NZB: ఖిల్లా రామాలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు

నిజామాబాద్‌ నగరంలోని చారిత్రాత్మక కట్టడం ఖిల్లా రామాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్సీ కవిత ఆలయ పరిసరాలను పరిశీలించారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఆమె సందర్శించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement