Sunday, May 5, 2024

విజయేంద్రప్ర‌సాద్ కి రాజ‌కీయల నేత‌ల నుండి- అభినంద‌న‌ల వెల్లువ‌

మాజీ మంత్రి ..బిజెపి జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ టాలీవుడ్ క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కి అభినంద‌న‌లు చెప్పారు. హైద‌రాబాద్‌లోని విజ‌యేంద్ర ప్ర‌సాద్ నివాసానికి వ‌చ్చిన డీకే అరుణ‌.. ఆయ‌నకు అభినంద‌న‌లు తెలిపారు. రాజ్య‌స‌భ‌లో మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌రిచేలా విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు జోగులాంబ ఆశీస్సులు ఉంటాయ‌ని ఈ సంద‌ర్భంగా డీకే అరుణ తెలిపారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు అభినంద‌న‌లు తెలుపుతున్న ఫొటోల‌ను డీకే అరుణ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎంపికైన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు ఆయా పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నేత‌ల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ సీనియ‌ర్ నేత కె.లక్ష్మ‌ణ్ స్వ‌యంగా వ‌చ్చి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement