Thursday, May 2, 2024

సమ్మె విరమించకపోతే చర్యలే.. జూడాలకు కేటీఆర్ వార్నింగ్

జూనియర్ డాక్టర్ల సమ్మెపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెసిడెంట్‌, జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. స్టైఫండ్‌ పెంపు సహా పలు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ జూడాలు చేస్తున్నారు. అయితే, సమ్మెకు ఇది సరైన సమయం కాదన్నారు కేటీఆర్. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, సమ్మె విరమించాలని కేటీఆర్ కోరారు.

కోవిడ్‌ ఉద్ధృతి సమయంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవలు అందక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జూడాలు విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డికి తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు సమ్మె నోటీసు ఇచ్చారు. 15 రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్పష్టం చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం తెపింది. సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రి సందర్శించిన సందర్బంలోనూ జూడాల సమస్యలు పరిష్కరానికి కృశి చేస్తామని చెప్పారని జూడా ప్రతినిధులు చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు.

ఇది కూడ చదవండి: ఇవి తింటే.. బ్లాక్ ఫంగస్ నుంచి కళ్లకు రక్షణ!

Advertisement

తాజా వార్తలు

Advertisement