Sunday, May 5, 2024

కేజీఎఫ్2 – వ‌ర‌ల్డ్ క్లాస్ మూవీ- ఉమ‌ర్ సంధు రివ్యూ

కెజిఎఫ్ 2 కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. యష్ కి జోడిగా ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి నటించింది. మొత్తంగా ఉమర్ సందు రివ్యూ బయటకి రావడంతో యష్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. కేజిఎఫ్ 2 చిత్రం ఆర్ఆర్ఆర్ రికార్డులు తిరగరాస్తుంది అంటూ అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. కెజిఎఫ్ 2 చిత్రానికి తాజాగా ఓవర్సీస్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిలిం క్రిటిక్, సెన్సార్ మెంబర్ ఉమర్ సంధు కెజిఎఫ్ 2 చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఈ చిత్రానికి ప్రతి అంశం గురించి ఉమర్ సందు సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. ‘కెజిఎఫ్ 2 కన్నడ సినిమా రంగానికి కీర్తి కిరీటం. మొదటి నుంచి చివరి వరకు అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నారు. డైలాగులు షార్ప్ గా ఎఫెక్టివ్ గా ఉంటాయి. సాంగ్ జస్ట్ ఒకే. కానీ బిజిఎం మాత్రం అదిరిపోయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతమైన పనితనం ప్రదర్శించారు. సినిమా మొత్తం ఒకే ఇంటెన్సిటీ మైంటైన్ చేయడంలో దర్శకుడు విజయవంతం అయ్యారు. ఇది కేవలం కన్నడ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు వరల్డ్ క్లాస్ మూవీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement