Saturday, May 18, 2024

విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ – ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తోన్న తాజా చిత్రం ‘విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ’ ఒక‌టి. ముర‌ళి కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. శ్రీరామ‌న‌వ‌మీ సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. లేటెస్ట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌లో దేవ‌స్థానం ముందు కిర‌ణ్, చేతిలో స‌న్నాయి ప‌ట్టుకొని గంగిరెద్దు ప‌క్క‌న నిల్చున్న‌ట్లు పోస్ట‌ర్‌లో ఉంది. ఈ చిత్రాన్ని అల్లుఅర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు నిర్మిస్తున్నాడు. ‘న‌ర్తన‌శాల’ ఫేం కాశ్మీరా హీరోయిన్‌గా న‌టిస్తుంది. చైత‌న్య భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement