Sunday, May 5, 2024

KGF 2 మరో రికార్డ్.. రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన యష్

రాకింగ్ స్టార్ య‌శ్ sలేటేస్ట్ సెన్సేషన్ KGF 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన చిత్రం KGF ఛాప్ట‌ర్ 2 రూ. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల క్లబ్‌ను దాటింది. దక్షిణాది చిత్రాల సత్తాను బాలీవుడ్ కు మరోసారి చూపించింది. యశ్ నటించిన ఈ చిత్రం రెండు వారాల తర్వాత రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి అభిమానులను ఆనందపరిచింది. గోల్డ్ మైన్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన KGF ఛాప్ట‌ర్ 1 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా నాలుగేళ్ల త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు పాన్ ఇండియా చిత్రంగా వ‌చ్చిన KGF 2 కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ సినిమా విడుద‌లై 15 రోజులు కాగా.. రూ.1000 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఇంకా దూసుకుపోతోంది.

ఇండియ‌న్ సినిమా చరిత్రలో రూ. వెయ్యి కోట్ల క్ల‌బ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు మాత్ర‌మే ఉన్నాయి. అమీర్ ఖాన్ ‘దంగల్’, ప్రభాస్ ‘బాహుబలి 2’, రామ్ చరణ్ -ఎన్టీఆర్ నటించిన RRR సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ లో ఉండగా.. తాజాగా ఇప్పుడు నాలుగో చిత్రంగా KGF 2 చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement