Thursday, May 2, 2024

సింగ‌ర్ గా మారిన పోసాని కృష్ణ‌ముర‌ళి – గ్రీన్ టీ సాంగ్ రిలీజ్

సింగ‌ర్ గా మారారు న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళి.. భ‌ళాతంద‌నాన చిత్రం నుండి గ్రీన్ టీ సాంగ్ ని రిలీజ్ చేశారు.ఈ పాట‌ను ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి ఆల‌పించాడు. చైత‌న్య దంటులూరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న చిత్రం ఇది. సోష‌ల్ ఇష్యూస్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ పొలిటిక‌ల్ డ్రామా మే 6న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ల‌ను ప్రారంభించింది. శ్రీ విష్ణుకు జోడీగా కేథ‌రీన్ థెరిస్సా హీరోయిన్‌గా న‌టించింది. కేజీఎఫ్ ఫేం గ‌రుడ రామ్‌, పోసాని కృష్ణ ముర‌ళి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘గ్రీన్ టీ’ అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పెప్పీ నెంబ‌ర్ సాంగ్‌గా సాగుతున్న కాస‌ర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను పోసానితో కలిసి పృథ్వీ చంద్ర, హారికా నారాయ‌ణ్ ఆల‌పించారు. మ‌ణిశ‌ర్మ స్వ‌ర ప‌రిచిన ఈ పాట వెస్ట‌ర్న్ స్టైల్లో క్యాచీగా ఉంది. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై ర‌జ‌నీ కొర్రాపాటి నిర్మించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement