Sunday, May 5, 2024

కేరళ గోల్డ్​ స్మగ్లింగ్​ కేసు.. విచారణకు రావాలని స్వప్న సురేశ్​కు ఈడీ సమన్లు..

కేరళ గోల్డ్​ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలు స్వప్న సురేష్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ​​జారీ చేసింది. బుధవారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కాగా, నిన్ననే ఈ సమన్లు పంపినట్టు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కావాలని ఆమెను అడిగారు. అయితే స్వప్నను వ్యక్తిగతంగా కానీ, తన ప్రతినిధి ద్వారా కానీ హాజరు కావాలని కోరారు. ఈ కేసులో కేరళ ముఖ్యమంత్రి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్‌పై స్వప్న చేసిన ఆరోపణల నేపథ్యంలో సమన్లు ​​వచ్చాయి.

తాను ఇంతకుముందు ఏది చెప్పానో.. ఇప్పుడూ అదే చెబుతానని స్వప్న సురేష్ అన్నారు. తనకు ఇంకా నోటీసు అందలేదని, ఇ‌మెయిల్ అకౌంట్​లో టెక్నికల్​ ఇష్యూస్​ కారణంగా రాకపోవచ్చన్నారు. తనను ఎందుకు పిలుస్తున్నారో తెలియదని, తనను అడిగే అన్ని ప్రశ్నలకు స్పష్టంగా రిప్లయ్​ ఇస్తానని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు స్వప్న సురేష్.

తాను కస్టడీలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుకూలంగా ఆడియో క్లిప్ విడుదల చేయడం వెనుక శివంశకర్ హస్తం ఉందని స్వప్న ఆరోపించారు. ఈ కేసులో సీఎం కార్యాలయానికి సంబంధం లేదని స్వప్న చెప్పిన ఆడియో క్లిప్‌ను శివశంకర్ ఆదేశాల మేరకు విడుదల చేసినట్లు ఆమె తెలిపారు.  కాగా, ఈ కేసు 2020 జులై 5వ తేదీన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో నమోదైంది. అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్​ అధికారులు 30 కిలోల కంటే ఎక్కవ బరువు ఉన్న సుమారు 1.5కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

అప్పట్లో బంగారం స్వాధీనం పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. ఇది కేరళలో అధికార లెఫ్ట్ ప్రభుత్వ పునాదిని కదిలించింది. ముఖ్యంగా సీఎం మాజీ సెక్రెటరీ ఎం శివశంకర్ జోక్యం చేసుకున్న తర్వాత  మరింత వివాదం ముదిరింది. అయితే బంగారం స్మగ్లింగ్ ఘటనలో తాను ఎలాంటి అక్రమ జోక్యం చేసుకోలేదని, స్వప్న సురేశ్‌కు ఎప్పుడూ మేలు చేయలేదని తన పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. ఆమె స్మగ్లింగ్‌లో పాల్గొందని తెలిసి షాక్‌కు గురయ్యానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement