Wednesday, May 15, 2024

ప్యారాసెట‌మాల్ తో ప్ర‌మాద‌మే – హెచ్చ‌రించిన యూనివర్సిటీ ఆఫ్ ఎడింబర్గ్ పరిశోధకులు

ప్యారా సెట‌మాల్ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఈ ట్యాబ్లెట్ వాడకం విప‌రీతంగా పెరిగింది. అయితే నిత్యం ప్యారాసెట‌మాల్ ట్యాబ్లెట్ వాడితే ర‌క్త‌పోటు, గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. గుండెపోటు, స్ట్రోక్స్ ముప్పు ఉన్న వారికి ప్యారాసెటమాల్ మాత్రలను సూచించే విషయంలో వైద్యులు జాగ్రత్తగా వ్యవహరించాలని యూనివర్సిటీ ఆఫ్ ఎడింబర్గ్ పరిశోధకులు సూచిస్తున్నారు. వీరు అధిక రక్తపోటు చరిత్ర ఉన్న 110 మంది రోగులపై పరిశోధన నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపులోని వారికి ఒక గ్రాము (1000ఎంజీ) ప్యారాసెటమాల్ ను రోజూ నాలుగు సార్లు చొప్పున ,రెండు వారాల పాటు ఇచ్చారు.

మరో గ్రూపులోని వారికి ఎటువంటి మందులేని ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ రెండు గ్రూపులను మార్చి.. ముందు ప్యారాసెటమాల్ ఇచ్చిన వారికి ఉత్తుత్తి ట్యాబ్లెట్, ఉత్తుత్తి ట్యాబ్లెట్ ఇచ్చిన గ్రూపులోని వారికి ప్యారాసెటమాల్ ఇచ్చి చూశారు. ప్యారాసెటమాల్ తీసుకున్న వారిలో నాలుగు రోజుల్లోనే రక్తపోటు పెరగడాన్ని గుర్తించారు. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పును 20 శాతం పెంచుతుందని తెలుసుకున్నారు. ఐబూప్రోఫెన్ వంటి మాత్రలకు ప్యారాసెటమాల్ సురక్షిత ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం ఉంది. తాజా ఫలితాల నేపథ్యంలో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ మప్పు ఉన్న వారికి ప్యారాసెటమాల్ ఇవ్వకపోవడాన్ని పరిశీలించాలి’’అని ఎడిన్ బర్గ్ యూనివ్సిటీ ప్రొఫెసర్ వెబ్ పేర్కొన్నారు. ఈ మేర‌కు ప్యారా సెట‌మాల్ వాడ‌కాన్ని త‌గ్గించాల‌ని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement