Sunday, May 5, 2024

కేర‌ళ‌ని వ‌ణికిస్తున్న ‘బ‌ర్డ్ ఫ్లూ’

ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తున్నాయి ప‌లు ర‌కాల వైర‌స్ లు. క‌రోనా, ఒమిక్రాన్ ల‌తో ప్ర‌పంచం వ‌ణికిపోతుంటే, కేర‌ళ‌లో మాత్రం బ‌ర్డ్ ఫ్లూ వ‌ణికిస్తుంది. ఇంత‌కు ముందు కేర‌ళ‌లో నిఫా వైర‌స్, జికా వైర‌స్ లు భీభ‌త్సం సృష్టించాయి. క‌రోనా కూడా ఓ స్థాయిలో ఉంది కేర‌ళ‌లో. ఇప్పుడు బ‌ర్డ్ ఫ్లూ క‌ల క‌లంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోళ్లు, బాతులు, వివిధ రకాల పక్షులు వ్యాధి బారిన పడుతున్నాయి. దీంతో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకుంలటున్నారు. ఇందులో భాగంగా కొట్టాయం జిల్లాలో గత రెండు రోజుల్లోనే 16,976 బర్డ్ ఫ్లూ సోకిన బాతులను గుంతలో తవ్వి పూడ్చిపెట్టారు. మరోవైపు కేరళ వ్యాప్తంగా ఫారాల్లో రసాయనాలను స్ప్రే చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement