Thursday, April 25, 2024

రాయ‌లసీమ ఎత్తిపోత‌ల‌ చేప‌ట్టొద్దు… ఎన్జీటీ

జాతీయ హరిత ట్రైబ్యునల్ రాయ‌ల‌సీమ వాసుల‌కు షాక్ ఇచ్చింది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై ఎన్జీటీ కీల‌క తీర్పు ఇచ్చింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. నిబంధనలు కాద‌ని నిర్మాణం చేపడితే.. ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తోందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం విషయమై అధ్యయన కోసం.. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రాంతీయ అధికారి, కేంద్ర జల సంఘం అధికారి సహా.. నలుగురితో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ఏపీ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని పేర్కొంది. అలాగే నాలుగు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించాలని ఎన్​జీటీ తీర్పు చెప్పింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement