Wednesday, May 15, 2024

‘జీవ‌న్ లైట్ స్మార్ట్ మెడిక‌ల్ ఐసీయూ’ను ప్రారంభించిన గ‌వ‌ర్న‌ర్

క‌రోనా స‌మ‌యంలో వెంటిలెట‌ర్ కోసం ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డార‌ని తెలిపారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్. కాగా కంది ఐఐటీ హైదరాబాద్‌లో జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూను గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్‌లో తయారు చేసిన జీవన్‌ లైట్‌ స్మార్ట్‌ మెడికల్‌ ఐసీయూ వెంటిలెటర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహమ్మారి సమయంలో భారతీయులు ఎన్నో ఆవిష్కరణలు చేశారని, దేశంలో నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చిందన్నారు. దేశం నుంచి గొప్ప గొప్ప ఆవిష్కరణలు రావడం గర్వంగా ఉందన్న ఆమె.. రాష్ట్రం ఫార్మా రంగానికి క్యాపిటర్‌గా ఉన్నదని, తెలంగాణ నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌, మందులు ఎగుమతులు జరిగాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement