Monday, April 29, 2024

క‌ల్తీ క‌ల్లు తాగడంతో 15మందికి అస్వ‌స్థ‌త – ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

క‌ల్తీ క‌ల్లు తాగ‌డంతో 15మంది అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. దాంతో వారిని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంఘ‌ట‌న మెద‌క్ జిల్లా శివంపేట‌లోని కొంతాన్ ప‌ల్లిలో చోటు చేసుకుంది. కొంతాన్ ప‌ల్లికి చెందిన వ్య‌క్తి ఆ గ్రామంతో పాటు తుఫ్రాన్ మండ‌లం వ‌ట్టూర్ లో కూడా తెల్ల క‌ల్లుని విక్ర‌యిస్తుంటాడు. కాగా అత‌ని వ‌ద్ద క‌ల్లు తాగిన వారు అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. దాంతో వారు విప‌రీతంగా వాంతులు చేసుకున్నారు. ప‌క్ష‌వాతం వ‌చ్చిన విధంగా చేతులు, కాళ్లు వంక‌పోయాయి. దీంతో వారంద‌రినీ వారి కుటుంబ స‌భ్యులు, స్థానికులు హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు.

స్థానిక హాస్పిట‌ల్స్ తీసుకెళ్లి చికిత్స అందించే క్ర‌మంలో వారి ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. దీంతో వారంద‌రినీ హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. క‌ల్లు తాగిన వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. క‌ల్లులో కెమిక‌ల్స్ అధిక మోతాదులో క‌ల‌ప‌డం వ‌ల్లే ఇలాంటి స‌మ‌స్య త‌లెత్తి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు ప్రాథ‌మికంగా అంచ‌నాకు వ‌చ్చారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అందులో కెమిక‌ల్స్ క‌లిపిన‌ట్టు రుజువు అయితే క‌ల్లుబ‌ట్టి నిర్వాకుడిపై చ‌ట్ట‌రీత్యా చర్య‌లు తీసుకుంటామ‌ని అబ్కారీ అధికారులు వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement