Thursday, May 16, 2024

Big Story: జుగ్ను బన్‌ గయా పంజాబ్‌ సీఎం, కమెడియన్‌ టు చీఫ్‌ మినిస్టర్‌

పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ.. భగవంత్‌ మాన్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఒకప్పుడు హాస్యనటుడిగా ప్రజలను నవ్వించిన భగవంత్‌ మాన్‌.. నేడు పంజాబ్‌ రాష్ట్రానికి సీఎం అయ్యాడు. తాగుబోతు అన్న విమర్శలు కూడా ఎదుర్కొన్న 48ఏళ్ల భగవంత్‌ మాన్‌.. జన నేతగా పేరు ప్రఖ్యాతులు సంపాధించుకున్నాడు. స్టేజ్‌ పెర్‌ఫార్మర్‌ నుంచి పొలిటికల్‌ స్టేజీ మీదకు చీపురు పట్టుకుని దూసుకొచ్చారు.
– 48 ఏళ్ల భగవంత్‌ మాన్‌, పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లా సతోజ్‌లో పుట్టాడు. కాలేజీ రోజుల నుంచి యూత్‌ కామెడీ ఫెస్టివల్స్‌లో పాల్గొనేవాడు. జుగ్నూ ఖేండా హైతో ప్రారంభించి.. జుగ్నూ మస్‌ ్త మస్‌ ్త వంటి షోలతో పేరు తెచ్చుకున్నాడు.
– షహీద్‌ ఉధమ్‌ సింగ్‌ ప్రభుత్వ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. చిన్నతనం నుంచే కామెడీలంటే ఎంతో ఇష్టం. కాలేజీ రోజుల్లో కూడా ఎన్నో యూత్‌ ఫెస్టివల్స్‌తో పాల్గొన్నాడు.


– 1973, అక్టోబర్‌ 17న పుట్టిన భగవంత్‌ మాన్‌ ముద్దుపేరు జుగ్ను. 2008లో ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌తో దేశంలోనే ప్రపంచ దేశాల్లో మాన్‌ ఎంతగానో పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కూడా నటించారు.
– భగవంత్‌ మాన్‌ తండ్రి పేరు మోహిందర్‌ సింగ్‌. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లాలోని ఎస్‌యూఎస్‌ ప్రభుత్వ కళాశాలలో బీకామ్‌ చదివిన మాన్‌ ఇంద్రప్రీత్‌ కౌర్‌ను వివాహం చేసుకున్నారు.

రాజకీయ జీవితం
– కమెడియన్‌గా ఎంతో గుర్తింపు సాధించిన భగవంత్‌ మాన్‌.. 2011లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌లో చేరి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో లెహ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆప్‌లో చేరిన మాన్‌.. ఆ ఎన్నికల్లో సంగ్రూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 2లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
– 2017లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జలాలాబాద్‌ నుంచి పోటీ చేయగా.. మళ్లిd ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదత్‌ చేతిలో మాన్‌ ఓడిపోయారు.
– 2019 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయగా.. రెండో సారి విజయం సాధించారు. లోక్‌సభలో ప్రస్తుతం ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ఉన్న ఏకైక ఎంపీ కూడా ఆయనే.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ధురి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

వివాదాలకు కేరాఫ్‌
– కామెడియన్‌ పాపులారిటీ ఉన్నప్పటికీ.. భగవంత్‌ మాన్‌ అనేక వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కూడా నిలిచారు. 2016లో ఒకసారి పార్లమెంట్‌ ప్రాంగణంలో లైవ్‌ స్ట్రీమ్‌ పెట్టాడు. భద్రత నిబంధనలు ఉల్లంఘించారని విమర్శలకు దారితీసింది.
– లోక్‌సభకు మద్యం తాగి వచ్చారని కొందరు ఎంపీలు ఆయనపై ఫిర్యాదు చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇటీవల పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రత్యర్థ పార్టీ అభ్యర్థులు ఇదే ఘటనను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.
– 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే.. ఆయన మద్యం మానేస్తున్నట్టు బహిరంగంగా ప్రమాణం కూడా చేశారు. ఓ ఎన్నికల ర్యాలీలో వేదికపై తల్లి పక్కన ఉండగానే.. ఇకపై తాను మద్యం ముట్టుకోనని ప్రమాణం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement