Monday, April 29, 2024

పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ, సీఎంగా భగవంత్‌ మాన్‌.. కొత్తదనం కోరుకున్న ఓటర్లు

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల విలక్షణమైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్‌, శిరోమణి అకాలీ దళ్‌తో పాటు బీజేపీ కూటమి పాలనను రుచి చూసిన పంజాబీలు.. ఆప్‌కు అవకాశం ఇచ్చి చూడాలని భావించారు. అన్ని పార్టీల సీఎం అభ్యర్థులకు షాక్‌ ఇచ్చారు.. ఉద్ధండులను ఇంటికి పంపి.. సామాన్యులను అసెంబ్లీకి పంపారు.. అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలన అంశాలు పంజాబీలకు నచ్చలేదు.. ఇలాంటి సమయంలో ఆశా కిరణంగా కనిపించిన ఆప్‌కు పట్టం కట్టారు. ఢిల్లీ తరహా పాలన అందిస్తానన్న కేజ్రీవాల్‌ హామీకి ఫిదా అయ్యారు.

ఉచిత విద్యుత్‌, వైద్యం, విద్య పరంగా ఇచ్చిన భరోసా ఎంతో ఆకట్టుకుంది.. మిస్టర్‌ క్లీన్‌గా ఉన్న భగవంత్‌ మాన్‌ను సీఎం చేస్తే.. తమ ఆశలు నెరవేరుతాయన్న నమ్మకంతో.. తమ ఐదేళ్ల భవిష్యత్తును కేజ్రీవాల్‌ చేతుల్లో పెట్టారు.. 92 స్థానాలను దక్కించుకుని ఆప్‌ చరిత్ర సృష్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement