Thursday, May 2, 2024

అరుదైన రికార్డ్ – అకాడ‌మీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో ‘జైభీమ్’

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన జై భీమ్ చిత్రం ఇప్ప‌టికే ఎన్నో రికార్డ్స్ ని సృష్టించింది. కాగా ఈ చిత్రానికి మ‌రో అరుదైన రికార్డ్ ద‌క్కింది. అకాడ‌మీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో ఈ చిత్రంలోని ఓ దృశ్యాన్ని పోస్ట్ చేశారు. కాగా అకాడ‌మీ యూట్యూబ్ వేదిక‌గా త‌మిళ సినిమాకి సంబంధించిన వీడియోను ఉంచ‌డం ఇదే ఫ‌స్ట్ టైం. దాంతో సూర్య ఫ్యాన్స్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. జై భీమ్‌ ఇండియన్‌ సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిందని ఎక్కించిందని వారు హర్షం వ్యక్తం చేసారు. వినూత్న పాత్రలతో అలరించే నటుడు హీరో సూర్య. తనకు మంచి పాత్ర పడాలే కానీ.. తనలో ఉన్న నటనను బయటకు తీస్తాడు. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ’జై భీమ్ ‘ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించాడు. ఈ మూవీపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. లాయర్ పాత్రలో సూర్య జీవించాడు. ఆడియన్స్ నుంచి సినిమాకు విశేష ఆదరణ లభించింది. టీజే జ్ఞానవేల్ డెరెక్షన్ లో సూర్య సతీమణి జ్యోతిక రూపొందిన జై భీమ్ సినిమాను పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా ప్రశంసించారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement