Monday, May 6, 2024

ఫారెన్​ టూర్లపై నో రిస్ట్రిక్షన్​.. విమానాల రాకపోకలపై కరోనా ఆంక్షల సడలింపు

కొవిడ్ నియంత్రణల సడలింపులతో అంతర్జాతీయ ప్రయాణికుల విమాన కార్యకలాపాలు మార్చి 27 నుండి తిరిగి ప్రారంభమవుతాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ రోజు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కవరేజీ పెరిగిందని, కరోనా వ్యాప్తి కూడా తగ్గుముఖం పట్టిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న సస్పెన్షన్‌ను చివరిసారిగా పొడిగించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడాన్ని నిరోధించే ప్రయత్నంలో భాగంగా 2020 మార్చి నెలలో భారతదేశం నుంచి విదేశాలకు.. విదేశాల నుంచి దేశానికి రాకపోకలపై ఆంక్షలు విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement