Friday, May 3, 2024

మహిళలు అన్ని రంగాల్లో ముందు : పోలీస్ కమిషనర్

మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు అన్నారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పోలీసు కళ్యాణ మండపంలో మహిళా పోలీస్ సిబ్బందితో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో కూడా మగవారితో సమానంగా, మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారన్నారు. మహిళలు లేకుంటే అంతా శూన్యం అని, ప్రతి స్త్రీకి రెండుమార్లు పేర్లు ఉంటాయని, మొదట తల్లిదండ్రుల వద్ద, మరొకటి అత్త మామ వద్ద ఉంటుంన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తండ్రి పేరుతో సమానంగా తల్లి పేరు కూడా జత చేయాలి నిర్ణయించిందని, డాక్టర్ అంబేద్కర్ తన తల్లి ప్రోద్బలం వలన రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని, ఆ రాజ్యాంగంలో మహిళలకు వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఎంతో పోరాడారన్నారు. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ సాధించేందుకు ముందుకు సాగాలని కోరుకుంటున్నామ‌న్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, అదనపు డి.సి.పి (ఏ.ఆర్) గిరిరాజు, అదనపు డీ.సీ.పీ (ఆపరేషన్స్) నరేందర్ రెడ్డి, పరిపాలనాధికారి రామారావు, నిజామాబాద్ ఏ.సీ.పీ వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement