Saturday, May 4, 2024

Covid Vaccination: వ్యాక్సినేషన్ లో మరో మైలురాయి.. 150 కోట్ల డోసులు పంపిణీ

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వాజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. తొలి, రెండో డోసు కలిపి మొత్తం 150 కోట్ల మైలురాయిని చేరింది.

కరోనా కట్టడిలో భాగంగా గతేడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారు ఇప్పటికే 90 శాతానికి పైగా తొలి డోస్ వ్యాక్సిన్ అందుకున్నారు. తొలి ఐదురోజుల్లో 15-18 ఏళ్ల టీనేజర్లు కూడా 1.5 కోట్ల మందికి పైగా తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి చేశాయి. మరికొన్ని రాష్ట్రాలలో 80 శాతం రెండో డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement