Saturday, April 27, 2024

టీఆర్ ఎస్ నుంచి వ‌న‌మా రాఘ‌వేంద‌ర్ స‌స్పెండ్

పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. సూసైడ్ నోట్ తో పాటు, సెల్ఫీ వీడియోలోనూ వనమా రాఘవేందర్ ప్రస్తావన ఉండడంతో అతడిపై పాల్వంచ పీఎస్ లో కేసు నమోదైంది. అయితే వనమా రాఘవేందర్ ను టీఆర్ఎస్ అధిష్థానం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అతడిపై వచ్చిన ఆరోపణలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. కాగా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడైన రాఘవేందర్ అరెస్ట్ పై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోంది. అతడిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను పోలీసులు ఖండించడంతో వనమా రాఘవేందర్ ఆచూకీపై సస్పెన్స్ నెలకొంది. అయితే గతంలో ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement