Sunday, May 19, 2024

Russia-Ukraine war: భద్రతా మండలిలో ఓటింగ్‌- భారత్ సహా మూడు దేశాలు​ దూరం

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను పూర్తిస్థాయిలో రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి.  కీవ్​లోని సైనిక స్థావరంపై రష్యా బలగాలు దాడి చేశాయి. అయితే వీటిని దీటుగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్​ సైన్యం వెల్లడించింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయ్యింది. రష్యాకు వ్యతిరేకంగా భద్రతా మండలిలో ఓటింగ్‌ కూడా నిర్వహించారు. అయితే, ఓటింగ్‌కు మాత్రం భారత్‌, చైనా, యూఏఈలు దూరంగా ఉన్నాయి. భద్రతా మండలి 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేఖంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఖండిస్తూ ఓటు వేయగా.. భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన విటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది. మొదటి నుంచి ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement