Sunday, April 28, 2024

మీకు దమ్ముంటే … మున్సిప‌ల్ మంత్రిగా నాపై కేసులు పెట్టండి… మంత్రి కేటీఆర్ స‌వాల్

ఇంజినీర్లు, చిన్నా చితకా కార్మికులపై కేసులు కాదు.. మీకు దమ్ముంటే మున్సిపల్‌ మంత్రిగా తనపై కేసులు పెట్టాలని.. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సవాల్‌ విసిరారు. నగర పరిధిలోని కైతలాపూర్‌ పరిధిలోని ఫ్లై ఓవర్‌ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా.. ఎల్‌బీనగర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు, ఉప్పల్‌ నుంచి శేరిలింగంపల్లి వరకు ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లు, ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు ఒకటి రెండు కాదు.. రూ.8052కోట్లతో ఎస్సార్‌డీపీలో మొదటి దశ కింద 47 వివిధ కార్యకమాలు తీసుకున్నం. గత 8 సంవత్సరాల్లో ప్రభుత్వం కట్టిన 30వ ఫ్లై ఓవర్‌ ఇది. ఇంకా 17 వివిధ దశల్లో ఉన్నయ్‌.. వాటిని కూడా పూర్తి చేసి ఈ సంవత్సరం ఆరు.. మిగతా వాటిని వచ్చే సంవత్సరం హైదరాబాద్‌ ప్రజలకు కానుకగా అందించబోతున్నామ‌న్నారు.

త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు, పార్కులు, వైకుంఠధామాలు బాగు చేసుకున్నామని, బస్తీల్లో ఉండే పేదలకు సుస్తీ అయితే.. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అన్నపూర్ల సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇప్పుడు ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమంలో పాఠశాలలు బాగు చేసుకుంటున్నామని, ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. అతి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాక ముందు ఈ రాష్ట్రంలో 29లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేది. రూ.200, రూ.500 పెన్షన్‌ వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 40లక్షల మందికి పెన్షన్లు వస్తున్నయ్‌. రూ.200 పెన్షన్‌ పది రెట్లు పెరిగి రూ.2000 అయ్యిందన్నారు. రూ.500 పెన్షన్‌ ఆరు రెట్లు పెరిగి.. రూ.3వేలు అయ్యిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం.. ఆ నాడు ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ.800కోట్లు ఖర్చు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వంలో రూ.10వేలకోట్లకు పైగా ఖర్చు పెడుతున్నమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement