Tuesday, May 7, 2024

ఇక మీద‌ట ఆ ప‌ని చేయ‌ను.. ఎందుకంటే నాకు అలా న‌చ్చ‌డం లేదు..

వెబ్ సిరీస్‌ల‌తో దూసుకెళ్తున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇక మీద‌ట త‌ను ఆ ప‌నిచేయ‌నంటున్నారు. ఎన్నో విలక్షమైన క్యారెక్ట‌ర్ల‌లో నటించి.. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ నవాజుద్దీన్ తన నటనతో సత్తా చాటుకున్నారు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. న‌వాజుద్దీన్‌ నటించిన‌ పలు వెబ్ సిరీస్ లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో సిద్ధిఖీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.. ఇక మీదట తను ఓటీటీలో కనిపించనని తెలిపారు.

ఓటీటీలు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాయి. నటుడిగా వెబ్ సిరీస్ లు మంచి చాన్స్‌లు ఇస్తాయని అనుకున్నా.. స్టార్టింగ్‌లో ఓటీటీ కంటెంట్ అంటే చాలా అభిమానం ఉండేది.. కానీ, ఇప్పుడు ఆ కంటెంట్.. వెబ్ సిరీస్ లు అంటే చాలా అసహ్యం కలిగే పరిస్థితి వచ్చింది అని తెలిపారు. శాక్రెడ్ గేమ్స్ లో నటిస్తున్న సమయంలో చాలా ఎగ్జైట్ అయ్యానని.. అప్పట్లో ఈ ఓటీటీలపై చాలా గౌరవం ఉండేదని.. ఇప్పుడు వెబ్ సిరీస్ సు బూతులుగా మారిపోయాయ‌న్నారు.

సరైన కంటెంట్ చిత్రాలను తియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఓటీటీలో వచ్చే కంటెంట్ లో బూతు ఎక్కువగా ఉంటోందని.. వెబ్ సిరీస్ అంటేనే బూతుగా భావించే పరిస్థితి వచ్చిందన్నారు.. అందుకే తను ఇక మీదట ఓటీటీలో నటించాలనుకోవడం లేదని తేల్చీ చెప్పారు. కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తానని.. ముందు ముందు వెబ్ కంటెంట్ అంటే మరింత దారుణంగా కనిపించే పరిస్థితి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement