Friday, May 17, 2024

మ‌రో నిరుద్యోగి ఆత్మ‌హ‌త్య‌..కేసీఆర్ కి లేఖ‌..

అభివృద్ధిప‌థంలో దూసుకుపోతున్నామ‌ని చెప్పుకుంటోన్న టిఆర్ ఎస్ ..నిరుద్యోగాల విష‌యంలో ఎందుకు స‌క్సెస్ కాలేక‌పోతోందో ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కే తెలియాలి. ఈ విష‌య‌మై వైఎస్ ఆర్ టిపి పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఇప్ప‌టికే నిరుద్యోగుల కోసం దీక్షని చేశారు. ఉద్యోగాలు రాక ప‌లువురు నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం బాధాక‌రం. గత కొంత కాలంగా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేకపోవడంతో మనస్తాపం చెంది తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు లేఖ‌ని కూడా రాశాడు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన మహేష్ కు ఉద్యోగం లేదు. గత కొంత కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ దశలోనే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదరుచూస్తున్నారు. అయితే నోటిఫికేషన్లు రాక‌పోవ‌డంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య సమయంలో సూసైడ్ నోట్ రాశాడు. నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ కోరుతూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశాడా యువ‌కుడు.

ఏళ్లకేళ్లుచదువుతున్నా… నోటిఫికేషన్లు రాకపోవడంతో యువత నిరాశలో ఉంది. దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో పలువురి ఆత్మహత్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. మ‌రి ఈ ఘ‌ట‌న‌తో టిఆర్ ఎస్ పార్టీ ప్ర‌తిష్ట‌కి భంగం క‌లిగే అవ‌కాశం ఉంది. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంది. మ‌రి ఇప్ప‌టికైనా నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాన్ని అధికార పార్టీ కేసీఆర్ చెబుతారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement