Saturday, April 27, 2024

‘పాట‌లు ఇష్టమే.. ప్రకృతి ఇష్టమే’.. అర‌టి తోట‌లో సింగ‌ర్ సునీత‌..

ఈ వేళలో నీవు.. ఏం చేస్తూ ఉంటావో అన్న పాట దాదాపు అందరూ హమ్ చేసే ఉంటారు. ఈ పాటపాడిన సింగ‌ర్ సునీత అంటే కూడా తెలియని వారుండరు. తన సుస్వర గానంతో పాట‌లు పాడి ప్రేక్షకుల‌ను ఎంతో అలరిస్తారు సునీత.. కేవ‌లం పాట‌ల‌కు మాత్రమే కాకుండా.. తను ధరించే డ్రెస్సులతో కూడా ఎంతో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా ప్రకృతి ప్రేమికురాలిగా కూడా తను ప్రత్యేకత పొందారు. ‘‘నేను సంగీతాన్ని ప్రేమిస్తాను. అలాగే నా కుటుంబాన్ని, నా స్నేహితుల‌ను కూడా ప్రేమిస్తాను’’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు సునీత మైక్‌  వ‌దిలేసి వ్యవ‌సాయం చేయ‌డం మొద‌లు పెట్టేశారు. అంటే ఇక పాట‌లు పాడబోరని కాదండి.. ఆమె పాట‌లు పాడ‌తారు. దాంతో పాటు తాను వ్యవ‌సాయం చేయ‌డాన్ని ఎంతో ఇష్టప‌డుతున్నాన‌ని చెబుతున్నారు.

సింగర్ సునీత రీసెంట్‌గా త‌న అర‌టి తోట‌.. కూర‌గాయ‌ల తోట‌ల్లో ప‌నిచేస్తున్న వీడియోను ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. దీంతో పాటు జాయ్ ఆఫ్ ఫార్మింగ్ (వ్యవ‌సాయాన్ని ఇష్టప‌డుతున్నా) అనే క్యాప్షన్ పెట్టారు. ‘‘నాకు సంగీతం అంటే ఇష్టం. అలాగే నా కుటుంబం, స్నేహితులు, న‌న్ను ఇష్టప‌డే వారిని ప్రేమిస్తా’’ అని వీడియోతో పాటు తన మ‌న‌సులోని భావాల‌ను పోస్టులో రాసుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. మీరూ చూసి సునీతకు ఒక లైక్ కొట్టండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement