Friday, April 26, 2024

తూచ్‌.. తూచ్‌, నేను సీఎం అభ్యర్థిని కాను.. చిరాకుతో అలా చెప్పేశా: ప్రికాంకా గాంధీ

లక్నో : యూపీ సీఎం అభ్యర్థి విషయంలో తానే అభ్యర్థినని మీడియాకు చెప్పిన ప్రియాంకా గాంధీ వాద్రా నిన్న యూటర్న్‌ తీసుకున్నారు. అబ్బే.. నేను యూపీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిని కాదూ… అంటూ ప్లేట్‌ ఫిరాయించారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీకి కనీసం సీఎం అభ్యర్థి కూడా దొరకడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ విలేకరి పదే పదే ప్రశ్నిస్తే.. అలా చెప్పానని ప్రియాంకా సమాధానం ఇవ్వడం కాంగ్రెస్‌ను మరింత దిగజార్చేలా చేసింది. సీఎం అభ్యర్థి వేరే ఎవరో ఎందుకు.. నేను ఉన్నాను కదా.. నా ఫొటోలే కనిపిస్తున్నాయి కదా.. నేనే యూపీ సీఎం అభ్యర్థిని.. అంటూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆమే స్వయంగా, తాను యూపీ సీఎం రేసులో ఉన్నా అంటూ పరోక్షంగా బదులివ్వడంతో.. మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

నేను ఒక్కదాన్నే లేను కదా..!
శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ యూత్‌ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక.. సీఎం అభ్యర్థిత్వంపై చేసిన ప్రకటన.. శనివారం మార్చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని చెప్పలేదని అన్నారు. విలేకర్లు అదేపనిగా కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నలు వేయడంతో.. చిరాకుతో అలా కామెంట్‌ చేశానని చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా స్పష్టత ఇచ్చారు. పోటీ గురించి ఇప్పుడు అయితే ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. కాస్త అతిశయోక్తిగా స్పందించినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున తన ఒక్కరి ముఖమే లేదన్నారు. సీఎం అభ్యర్థి ఎవరనేది.. అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ఇంకా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎం అభ్యర్థి ప్రకటనలో వెనుకడుగు వేయడం లేదని తెలిపారు. సిద్ధాంత కోణంలో పోరాడుతున్నామని, మహిళా సాధికారతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తమ లక్ష్యం కోసం సమర్థవంతంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. అధికారం కోసం పాకులాడటం లేదన్నారు.

మా పార్టీ విధానం వేరు..
ఎన్నికల ముందే ప్రకటించడం.. తరువాత ప్రకటించడం తమ పార్టీ విధానమన్నారు. చాలా రాష్ట్రాలకు కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఉన్నారని.. వారిని ఎందుకు అడగరని ఎదురు ప్రశ్నించారు. ఈ ప్రశ్నను తన ఒక్కరినే ఎందుకు అడుగుతున్నారంటూ మండిపడింది. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. బీజేపీకి మాత్రమే తలుపులు పూర్తిగా మూసివేసినట్టు తెలిపారు. మిగిలిన పార్టీలకు తలుపులు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. తద్వారా.. యూపీ ఎన్నికల తరువాత.. ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరం అయితే.. బీజేపీయేతర పార్టీలతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్‌ సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల లబ్ది కోసం బీజేపీ మత, కుల ఎజెండాలతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రభుతం ఏర్పాటులో అఖిలేష్‌ యాదవ్‌కు ఇబ్బందులు వస్తే.. తాము మద్దతు ఇవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ విషయంలో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. యువకులు, మహిళల విషయంలో తాము రూపొందించిన ఎజెండా అమలు చేస్తే.. మద్దతు విషయంలో వచ్చిన నష్టం ఏమీ లేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement