Tuesday, March 26, 2024

అధికారంలోకి వస్తే.. ఇద్దరు ముఖ్యమంత్రులు, ముగ్గురు డిప్యూటీలు: ఒవైసీ

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పొత్తులు.. సీట్ల పంపకాలు.. అభ్యర్థుల ప్రకటనలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐఎంఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. ఏఐఎంఐఎం అధికారంలోకి వస్తే.. ఇద్దరు ముఖ్యమంత్రులు, ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటారని చెప్పుకొచ్చారు. బాబు సింగ్‌ కుశ్వాహా, భారత్‌ ముక్తి మోర్చాతో కలిసి ఓ కూటమిగా ఏర్పాటై.. అసెంబ్లిd ఎన్నికల బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు. ఏఐఎంఎం కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు సీఎంలలో ఒకరు ఓబీసీ కమ్యూనిటీ నుంచి ఉంటే మరో వ్యక్తి దళితుడు అయి ఉంటాడని చెప్పుకొచ్చారు. ముగ్గురు డిప్యూటీ సీఎంలు ముస్లిం కమ్యూనిటీ వ్యక్తులకు కేటాయిస్తామని వివరించారు. యూపీలో 20 శాతం ముస్లిం జనాభా ఉందని, మొత్తం 403 సీట్లలో.. 107 సీట్లు ఎలాగో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

గతంలో ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌ దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు ఒవైసీ గుర్తు చేశారు. రాజ్‌భర్‌ ఆ కూటమిని విడిచి పెట్టి.. సమాజ్‌వాదీ పార్టీలో కలిశారన్నారు. రాజ్‌భర్‌ పార్టీ తమ కూటమి నుంచి విడిపోయిందని, అయినప్పటికీ.. 100 సీట్లలో తమ కొత్త కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. యూపీలో ఏ పార్టీ కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ముస్లింలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఎవరు వచ్చినా ముస్లింల ప్రగతికి సహకరించడం లేదన్నారు. రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో అధికారం తమదే అని, తమ పాలనలోనే యూపీ మారుతుందని తెలిపారు. కొందరు ఎస్‌పీ ముస్లిం నేతలు కూడా అన్యాయం చేశారని మండిపడ్డారు. వారి కారణంగానే.. యూపీలో సామాజిక న్యాయం కొరవడిందని అన్నారు. సుహెల్‌ దేవ్‌.. కొన్ని రోజుల క్రితం వరకు బీజేపీని విమర్శిస్తూ వచ్చి.. మళ్లి సైకిల్‌పై సవారీ చేసేందుకు నిర్ణయించారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement