Friday, May 3, 2024

హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల వాడ‌కం మామూలుగా ఉండ‌దు

ఈ మ‌ధ్య‌కాలంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప‌లు సినిమాల్లోని సీన్స్ ని వారి ప్ర‌చారం కోసం వాడుకుంటున్నారు. అఖండ‌లో సీట్ బెల్ట్ పెట్టుకునే సీన్ ని వాడుకున్న పోలీసులు ఇప్ప‌డు స‌ర్కారు వారి పాట చిత్రంలోని ఓ సీన్ ని వాడుకుంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా న‌టించ‌గా… కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది.. మే 2న ఈ చిత్ర ట్రైలర్ విడుదలయింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. హైదరాబాద్ పోలీసులకు సర్కారు వారి పాట ట్రైలర్ అలా భలే దొరికేసింది. ఈ ట్రైలర్ లో మహేష్ బాబు..విల‌న్ ని హెల్మెట్ తో కొడతాడు. ఆ వెంటనే హెల్మెట్ ని అతడికి పెడతాడు. దీనిని హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హెల్మెట్ ధరించండి. సేఫ్టీ ముఖ్యం అని క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ఇప్ప‌డీ వీడియో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement