Wednesday, May 8, 2024

‘హెచ్ అండ్ ఎమ్’ లో దారుణం..దుస్తులు మార్చుకుంటుండ‌గా మొబైల్ తో షూట్..

అమ్మాయిల‌కి..మ‌హిళ‌ల‌కి షాపింగ్ చేయ‌డం అంటే మ‌హా ఇష్టం. షాపుల‌కి వెళ్ళి ప‌లు డ్రెస్స్ ల‌ను ట్రై చేస్తూ ఉంటారు. గంట‌ల గంట‌ల సేపు దుస్తుల దుకాణంలో గ‌డుపుతుంటారు. అయితే ఇప్పుడున్న టెక్నాల‌జీ ఏంటంటే సీసీ కెమెరాలు. వీటితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స‌మ‌యం. సాధార‌ణంగా ట్రైల్ రూంలో సీసీ కెమెరాలు ఉండ‌వు. కానీ కొంత‌మంది ఆక‌తాయిలు చేసే ప‌నుల‌కి మ‌హిళ‌లు..యువ‌తులు బ‌లి అవుతున్నారు. మహిళలు నగ్న ఫోటోలు మొబైళ్లలో తీసి… సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. అయితే.. ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌ లోని జూబ్లీ హిల్స్‌ చోటు చేసుకుంది.

జూబ్లీహిల్స్ లోని… హెచ్ అండ్ ఏం బట్టల దుకాణంలో దారుణం జరిగింది. ఓ యువతి… బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయిల్ రూమ్ లో నుంచి మొబైల్ ఫోన్ ద్వారా ఆమె నగ్న ఫోటోలను చిత్రీకరించారు ఇద్దరు విద్యార్థులు. అయితే.. ఈ విషయాన్ని పసి గట్టిన ఆ యువ‌తి…ఆ ఇద్దరి గురించి సమాచారం ఇచ్చింది. ఆ స్టోర్‌ పై మరియు వారిద్దరిపై కేసు పెట్టింది యువతి. దీంతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు….. ఇద్దరు విద్యార్థులతో పాటు. స్టోర్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. అంతేకాదు.. ఫోటోలు తీసిన సెల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యువ‌తి చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన తీరుని అభినందించారు అక్క‌డి వారంతా.

Advertisement

తాజా వార్తలు

Advertisement