Tuesday, May 14, 2024

Breaking | హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరబాద్​లో ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. సాయంత్రం 5 గంటల దాకా హాట్​ హాట్​​గా ఉన్న వెదర్ ఆ తర్వాత మారిపోయింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి.

జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, పెద్ద అంబర్​పేట్​ హయత్​నగర్​, వనస్థలిపురం, ఎల్బీనగర్​ మన్సూరాబాద్​, దిల్​సుఖ్​నగర్​, చైతన్యపురి, కొత్తపేట వంటి పలు ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.  ఇక.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి మోస్తరు జల్లులుంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక.. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించినట్టు వాతావరణ శౄఖ అధికారులు తెలిపారు. రాయలసీమ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement