Saturday, March 2, 2024

‘స్పై’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..

తెలుగు నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో స్పై మూవీ చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియన్ మూవీ జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌లపైకి రావడానికి సిద్ధంగా ఉంది. గత నెలలో ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్.. ఇప్పుడు ఈ సినిమా నుండి ఝూమ్ ఝూమ్ అనే టైటిల్‌తో మొదటి సింగిల్ ఇవ్వాల‌ సాయంత్రం రిలీజ్ చేశారు.

ఈ పాటను శ్రీచరణ్ పాకాల స్వరపరిచారు. స్పై మూవీలో, ఈశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలుగా నటించగా, ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమతం కీలక పాత్రలు పోషించనున్నారు. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించడమే కాకుండా స్క్రిప్ట్ కూడా రాశారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం విశాల్ చంద్రశేఖర్ ఓ పాటను కంపోజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement