Friday, April 26, 2024

హైద‌రాబాద్ విష‌తుల్యం – ఊపిరి తీస్తున్న ప్రాణ‌వాయువు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: గాలిలో మితిమీరిపోతున్న కాలుష్య ఉద్ఘారాలు, అనూహ్యంగా పెరిగిపోతున్న సూక్ష్మ ధూళి కణాల మోతాదు కారణంగా ప్రజారోగ్యానికి పెనుముప్పు పొంచి వుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ కాలుష్యం అత్యంత ప్రమాదకర పరిస్థితులను సూచిస్తోంది. వాయు కాలుష్యంలో అత్యంత ప్రమాదకరమైనవి అతిసూక్ష్మ ధూళి కణాలేనని, ఇవి మనిషి ఆరోగ్యాన్ని క్రమక్రమంగా క్షీణింపజేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న పలు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులపై లోతైన అధ్యయనం జరిగింది. ఢిల్లిdతో సహా పలు రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ళు కూడా ఈ అధ్యయనంలో భాగస్వామ్యం పంచుకున్నాయి. దక్షిణాదిలో వాయు కాలుష్యపరంగా పెనుముప్పు పొంచివున్న ఆరు ప్రమాదకర నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఉన్నట్లు తేలింది. అధ్యయన నివేదిక వెల్లడించిన అంశాలకు తోడుగా వాస్తవ పరిస్థితులు రోజురోజుకు తీవ్రతను పెంచేస్తున్నాయి. ముఖ్యంగా డీజెల్‌ వాహనాల కారణంగా సిటీ- పొగచూరుతోందని, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. నానాటికీ అదుపుతప్పి విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహానగరం పరిధిలో వాహనాల సంఖ్య సుమారు 89 లక్షలకు చేరువైంది. ఇందులో పదిహేనేళ్లకు పైబడిన కాలంచెల్లిన వాహనాలు 32 లక్షలకు పైమాటేనని అధికారుల అంచనా. వీటిలో డొక్కు బస్సులు, ట్రక్కులు, కార్లు తదితర డీజెల్‌ వాహనాలు విడుదల చేస్తున్న పొగతో ప్రధాన నగరంతోపాటు- శివారు ప్రాంతాల్లో వాయు కాలుష్యం మితిమీరిపోతోంది. సూక్ష్మధూళి కణాల కాలుష్యంతో పురుషుల్లో 1.79 శాతం గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని, మహిళల్లో 2.98 శాతం మందికి గుండె సంబందిత సమస్యలు పెరుగుతున్నట్లు- ఈ అధ్యయనం పేర్కొంది. ధూళి కణాల కాలుష్యం మెదడుకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలకు కూడా చేటు- చేస్తుందని ఈ అధ్యయనం స్పష్టంచేసింది.

ఇవి కాలుష్య కార‌కాలు..

  • నగరంలోని పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటు-తోంది. గ్రేటర్‌ పరిధిలో సుమారు 80 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్‌ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటిజన్లు ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటు-న్నాయి.
    -పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగుల బెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూ రుతున్నాయి. శివారు ప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలా పాలు పెరగడంతో సూక్ష్మధూళికణాలు పీల్చే గాలిలో చేరి సిటి-జన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి.
    -గ్రేటర్‌ పరిధిలో రాకపోకలు సాగించే 80 లక్షల వాహ నాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజెల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 20 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
  • వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్‌మోనా-కై-్సడ్‌, నైట్రోజన్‌ డయా-కై-్సడ్‌, సల్ఫర్‌ డయా-క్సైడ్‌, అమ్మోనియా, బెంజీన్‌, టోలిన్‌, ఆర్‌ఎస్‌పీ ఎం (ధూళి రేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతా వరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement