Saturday, December 7, 2024

పీఎఫ్ పై 8.15శాతం వడ్డీరేటును ఖరారు చేసిన ఈపీఎఫ్ఓ..

ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15% వడ్డీరేటు ను నిర్ణయిస్తూ.. కేంద్రానికి ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదనలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (8.10శాతం)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. ఈరోజు జరిగిన ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.15శాతం ఇవ్వాలని నిర్ణయించారు. సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement