Thursday, May 16, 2024

ఇది ప‌వ‌ర్ తుపానే – భీమ్లా నాయ‌క్ చిత్రంపై చిరంజీవి ట్వీట్

భీమ్లా నాయ‌క్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇది పవర్ తుపానే’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన భీమ్లా నాయక్ సెట్స్ పై సోదరుడు పవన్ కల్యాణ్, రానాలతో దిగిన ఫొటోను పంచుకున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పవన్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలన్నీ పాజటివ్ గా వచ్చాయి. విమర్శకులు సైతం పవన్, రానాల నటనకు ఫిదా అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement