Sunday, May 12, 2024

పెళ్లి వేడుకలో విషాదం.. డీజే శబ్దానికి వరుడి తండ్రి మృతి!

పెళ్లి వేడుకకు వచ్చిన వరుడి కుటుంబంలో విషాదం నిండుకుంది. డీజే శబ్దానికి వరుడి తండ్రి గుండె ఆగి మరణించాడు. ఈ సంఘటన ఒడిశాలోని మల్కన్‌గిరిలో జరిగింది. ఢిల్లీకి చెందిన అంకిత్‌కు మల్కన్‌గిరికి చెందిన యువతితో వివాహాం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యువకుడి కుటుంబం ఢిల్లీ నుంచి బుధవారం మల్కన్‌గిరి చేరుకుంది. అక్కడ ఓ ప్రైవేట్ హోటల్ లో బసచేసిన వరుడిని తీసుకెళ్లేందుకు వధువు తరపు కుటుంబ మేళతాళాలతో చేరుకుంది. ఈ క్రమంలో డీజేను ఒక్కసారిగా ఆన్ చేయడంతో ఆ శబ్దానికి వరుడి తండ్రి మహేంద్ర రహిలా గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ప్రైవేట్ హోటల్ నుంచి ప్రారంభమైన పెళ్లి ఊరేగింపు లాఠిగూడలోని వధువు వద్దకు చేరుకోవాల్సి ఉంది. అయితే, ఊరేగింపు మధ్యలో మహేంద్ర కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచాడు. 65 ఏళ్ల వృద్ధుడు తన కుమారుడి పెళ్లి ఊరేగింపులో మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నిపింది. వ్యక్తి మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడనప్పటికీ, పెద్ద DJ శబ్దం కారణంగా అతను గుండెపోటుకు గురయ్యాడని ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement