Monday, April 29, 2024

అపరిశుభ్రతతో హిందూ స్మశానవాటిక.. దహన సంస్కారాలకు ప్రజల ఇక్కట్లు

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో దహన సంస్కారాల కోసం ప్రజల ఇక్కట్లు పడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు అందుకు తగ్గట్టు ప్రజలకు సామాజిక అవసరాల కోసం ఏర్పాట్లను చేయడంలో మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందుతున్నారుని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా పట్టణం అంతటికీ కలిపి ఒకే హిందూ స్మశాన వాటిక ఉండడంతో దహన సంస్కారాల కోసం ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా స్థల సమస్యతో హిందువులు ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పడం లేదు. ఒక్కొసారి స్థలం లేక ఒక శవం మీద మరొక శవాన్ని ఉంచి దాన సంస్కారాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేగాక స్మశానవాటికలో అపరిశుభ్రత అధికం కావడంతో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. వర్షం వచ్చిందంటే స్మశాన వాటిక పరిసర ప్రాంతాల్లో బురదతో దర్శనమిస్తూ ఉండడంతో దహన సంస్కారాలు చేసేందుకు   ప్రజలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.

పట్టణంలో సుమారు లక్షకు పైగా జనాభా ఉన్న అందుకు తగ్గట్టు హిందూ స్మశాన వాటికలు లేక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత  అధికారులు  పట్టణంలోని అన్ని వైపులా హిందూ స్మశాన వాటిక లకు స్థలాలు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని  ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement