Sunday, April 28, 2024

షెడ్యూల్‌ ప్రకారమే అర్ధ వార్షిక పరీక్షలు..

ఆంధ్రప్రదేశ్ లో అర్ధ సంవత్సర పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా జరగనున్నాయి. హాఫ్‌ ఇయర్లీ పరీక్షలను సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌- 1గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏటా సంక్రాంతి సెలవులకు ముందే ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో సిలబస్‌ ప్రకారం నిర్వహిస్తున్నారు. సగం సిలబస్‌ పూర్తయిన తర్వాతే ఈ ఎస్‌ఏ- 1 పరీక్షలు జరగాల్సి ఉంటుంది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది నవంబర్‌లో, కర్ఫ్యూ కారణంగా ఈ విద్యా సంవత్సరంలో సెప్టెంబర్‌లో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో సిలబస్‌, విద్యా సంవత్సరం ప్రారంభం, సెలవులకు అనుగుణంగా ఎస్‌సీఈఆర్టీ విద్యా క్యాలెండర్‌ను రూపొందించింది. ఈ క్యాలెండర్‌ ప్రకారం ఎస్‌ఏ- 1 పరీక్షలు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు జరగాల్సి ఉంది.

అయితే ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో పరీక్షలు వాయిదా పడతాయనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో వాస్తవం లేదని, షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు నిరర్వహిస్తామని పాఠశాల విద్య ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరిగేలా రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లాల విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు అన్ని యాజమాన్య పాఠశాలలతో సమన్వయం చేసుకోవాలని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ డా.బి.ప్రతాప్‌ రెడ్డి సూచించారు.

మిగిలిన పరీక్షల షెడ్యూల్‌లో మార్పు..

అర్ధ వార్షిక పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించి, అనంతరం జరగాల్సిన యూనిట్‌ టెస్టులు, ఫైనల్‌ పరీక్షలను మాత్రం కాస్త ముందుగా జరపాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకునని ఈ మేరకు నిర్ణయించారు. దీని ప్రకారం గతంలో యూనిట్‌ టెస్టులుగా నిర్వహించి, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌- 3 పరీక్షలను ఫిబ్రవరిలో, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌- 4 పరీక్షలను మార్చిలో జరపాలని నిర్ణయించారు. అలాగే సంవత్సరాంత పరీక్షలను(ఫైనల్‌) ఏప్రిల్‌లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. పరీక్షల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 30వ తేదీతో విద్యా సంవత్సరాన్ని ముగించాలని నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement