Sunday, May 19, 2024

గవర్నర్ తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఫైర్

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గవర్నర్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఏడు నెలలుగా ఆపారన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే మూడు బిల్లులు పాస్ చేశారన్నారు. రాష్ట్ర ప్రగతిని ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలు గమనించాలన్నారు.

ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని.. రాష్ట్రపతి పరిశీలనకు పంపడం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా అని ప్రశ్నించారు. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఉద్యోగాలు ఇస్తామంటే 7నెలలు ఆపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపారన్నారు. తమ పిల్లలకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా అన్నారు. 1961 నుంచే బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అన్ని వర్సిటీలకు కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఉందన్నారు. గవర్నర్ చర్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement