Friday, May 3, 2024

ఊరికి చెరువు ఊపిరిగా రామ‌ప్ప – పాకాల ఎత్తిపోత‌ల ప‌థ‌కం….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాకతీయులు వ్యవసాయరంగానికి అత్యధికప్రాధాన్యత ఇస్తూ ఊరికి చెరువును ఈపిరిగా తీర్చిదిద్దిన బాటలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఆచెరువులను పునరుద్ధ రించడంతో పాటు నాటి జలాశయాల సామర్థ్యాన్ని పెంచుతూ ముందుకు కదులు తుంది. కాకతీయుల పానలలో నిర్మించిన చారి త్రాత్మక రామప్ప నుంచి పాకాల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పనుల్లో వేగం పెంచడంతో రాబోయో వర్షాకాలం నాటికి ఈ ప్రాజె క్టులు పూర్తి కానున్నాయి.అంతర్జాతీయ గుర్తింపు లభించిన రామప్ప దేవాలయానికి సమీపంలో పాలంపేట శివార్లలో కాకతీయ రాజు గణపతిదేవుని సేనాని నిర్మించిన రామప్పచెరువు నేటికి పసిడి పంటలను పండిస్తూంది. గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు క్రీ.శ. 1213లో 85చదరపు కిలోమీటర్లు విస్తరించిఉంది. అలాగే క్రీ.శ. 1213లో గణపతిదేవుని పాలనలో వరంగల్‌ నర్సంపేట సమీపంలో రెండుకొండలమధ్య నిర్మించిన పాకాల జలాశయం సుప్రసిద్ధ జలాశయం.

చరిత్రాత్మకమైన రామప్ప జలాశయం నుంచి పాకాల జలాశయం లోకి నీటిని ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రామప్ప నుంచి పాకాల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. తెలం గాణ రాష్ట్రం ఆవిర్భవించగానెె డీపీఆర్‌ఆర్‌ లను రూపొందించి ప్రారంభించిన పనులు జాన్‌ నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో రాత్రింభవళ్లు పనులు కొనసాగుతున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 30.000 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. ఈ రెండు చారిత్రాత్మక చెరువుల ఎత్తిపోతలతో పర్యాటకులు మరింత ఆకర్షితులయ్యే అవకాశాలు ఉండటంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధిని మరింతగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది.

రామప్ప- పాకాల ఎత్తిపోతల పథకంతో ఇప్పటివరకు సాగునీరు అందని అనేdక ప్రాంతాలకు నీటికొరత తీరే అవకాశాలున్నాయి. వర్షాధార పంటలకు బదులుగా రెండుపంటలు పండించే అవకా శాలు మెరుగుపడతాయని జలనిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లోని ప్రాచీన సంపదకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకుంటున్న చర్యలతో పాటుగా పాకాల అభయారణ్యానికి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం జాగ్రతగా ఎత్తిపోతల పథకం పనులు నిర్వ హిస్తుంది. ఇప్పటివరకు దాదాపుగా 90 శాతం పనులు పూర్తి కావ డంతో మరో 10 శాతం పనులు జూన్‌ లోగా పూర్తి చేయాలనే సంక ల్పంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ కృషిచేస్తుంది. వర్షాకాలం ప్రారంభ మైతే పనుల్లో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉండ టంతో ప్రస్తు తం వేసవిలోనే పనులు పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచారు.

రామప్పచెరువు వర్షం నీటితోనే నిండుతుంది. ఈ చెరువుకు ప్రత్యేకమైన నీటి ఊటలు లేకపోవడంతో వేసవిలో నీటి మట్టాలు తగ్గుతుంటాయి. ఈ నేపథ్యంలో సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు 50 టీఎంసీల కేటాయింపులనుంచి రామప్ప జలాశయానికి తొలుత నీ టిని ఎత్తిపోస్తారు. ఆతర్వాత రామప్పనుంచి పాకాలచెరువులోకి కాలువులు, మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. సంవత్సరానికి 120 రోజులు నీటిని ఎత్తిపోసే సామర్థ్యం గల మోటర్లను ఇప్పటికే బిగించారు. 3 టీఎం సీల నీటిని సామ్మక్క సాగర్‌ నుంచి రామప్పకు ఎత్తిపోసి ఆతర్వాత రామప్పనుంచి పాకాలకు ఎత్తిపోసే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ద్వారా 30 వేల ఎకరాలు సాగులోకివ స్తాయి. ఈ 30వేల ఎకరాల్లో పాకాల చెరువు కింద 15వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించేందుకు అవసరమైన నీటివనరులను నీటిపారుదల శాఖ సమకూరుస్తుంది. అలాగే ములుగు నియోజకవర్గంలోని దట్టమైన అడవిప్రాంతాల్లో విస్తరించి ఉన్న 8 వేల ఎకరాల ఆయకట్టుస్థిరీకరణ జరగనుంది. వీటితో పాటుగా నర్సంపేట నియోజక వర్గంలో 7 వేల ఎకరాల సాగుభూమికి నీటి సరఫరా జరగనుంది. జూన్‌ వరకు పూర్తి కానున్న ఈ ఎత్తిపోతల పథకంతో ఇప్పటివరకు వర్షాధార పంటలకే పరిమితమైన 30వేల ఎకరాలు గోదావరి నీటితో సస్యశ్యామలం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement