Tuesday, May 7, 2024

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాముల తులానికి రూ. 200 తగ్గింది. ప్రస్తుతం రూ.51 వేల 500కు చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం రేటు హైదరాబాద్‌లో రూ.330 మేర దిగివచ్చింది. ప్రస్తుతం రూ.56 వేల 180 వద్దకు చేరింది. గడిచిన 10 రోజుల్లో చూసుకుంటే మొత్తంగా రూ.1440 మేర తగ్గింది. ఒక్కరోజు మాత్రమే రూ.400 పెరిగింది. ఇక దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 300 తగ్గింది. ప్రస్తుతం రూ.51,650 వద్దకు చేరింది.

ఇక దిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ ధర తులానికి రూ.280 మేర తగ్గి రూ.56, 330 వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికి వస్తే గోల్డ్ దారిలోనే నడుస్తూ భారీగా పతనమవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు తాజాగా రూ. 900 మేర పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.70,000లకు దిగివచ్చింది. గత 10 రోజుల్లో చూసుకుంటే రూ.2000 మేర పడిపోయింది. ఇక దేశ రాజధాని దిల్లీలో చూసుకుంటే కిలో వెండి ధర రూ.800 మేర దిగివచ్చింది. ప్రస్తుతం రూ.67 వేల 500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో వెండి తక్కువకే లభిస్తుండగా.. బంగారం మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement