Monday, May 6, 2024

నేటి బంగారం ధ‌ర‌-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. కాగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47 వేలుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.51,270గా నమోదైంది. బంగారంతో పాటు సిల్వర్ రేటు కూడా నేడు దిగొచ్చింది. కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.60 వేలుగా పలుకుతుంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒడిదుడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. వెండి రేటు అయితే ఢిల్లీలో ఏకంగా రూ.3,200 మేర పతనమైంది. ఒక్కరోజే ఈ పతనాన్ని చవి చూసింది. కేజీ వెండి రేటు రూ.3,200 మేర తగ్గడంతో.. అక్కడ సిల్వర్ రేటు రూ.50,800 పలుకుతోంది. అలాగే బంగారం రేట్లు కూడా నేల చూపులు చూస్తున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.250 తగ్గి రూ.47,150గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,440గా పలికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement