Wednesday, May 8, 2024

పసిడి ప్రేమికులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మాత్రం వెలవెలబోయాయి. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 మేర పడిపోయింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ.51,600కు క్షీణించింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ. 47,300కు చేరింది. ఇక, వెండి ధర రూ.400 పెరుగుదలతో రూ.72,500కు ఎగసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement