Sunday, April 28, 2024

Big Breaking: డేంజర్​ లెవల్​లో గోదావరి.. భద్రాచలంలో 55 అడుగులు దాటి ఉధృతంగా ప్రవాహం!

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. బుధవారం రాత్రి 10 గంటల సమయానికి 55.60 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వాహిస్తోంది. దీంతో మరోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బుధ‌వారం రాత్రికి 64 అడుగుల నుంచి 66 అడుగుల దాకా ప్రవాహం పెరిగే చాన్సెస్​ ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అధికార‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

గ‌తంలో భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి 60 అడుగుల‌కు పైగా ప్ర‌వ‌హించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, 66 అడుగులు దాటి ప్ర‌వ‌హించింది మాత్రం కేవ‌లం మూడు సార్లు మాత్ర‌మే. ఇప్ప‌టి దాకా 60 అడుగుల పైన గోదావ‌రికి వ‌ర‌ద కొన‌సాగింది ఏడు సార్లు మాత్రమేనని రికార్డులు వెల్లడిస్తున్నాయి.

1976 జూన్ 22న ఫస్ట్​ టైమ్​ 63.9 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వ‌హించి రికార్డు క్రియేట్ చేసింది. 1983, ఆగ‌స్టు 14న 63.5 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ఉధృతి కొన‌సాగింది. ఈ రెండు రికార్డులు 1986లో క‌నుమ‌రుగ‌య్యాయి. అదే ఏడాది ఆగ‌స్టు 16న 75.6 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వ‌హించి చ‌రిత్ర సృష్టించింది. 1990, ఆగ‌స్టు 24న 70.8 అడుగుల వ‌ద్ద‌, 2006, ఆగ‌స్టు 6న 66.9 అడుగులు, 2013, ఆగ‌స్టు 3న 61.6 అడుగులు, 2020, ఆగ‌స్టు 17న 61.6 అడుగుల వ‌ద్ద గోదావ‌రి ప్ర‌వ‌హించింది.

1976 నుంచి ఇప్పటివరకు 18 పార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే.. ఈనెల 14న (గురువారం) గోదావరి ప్రవాహం 60 అడుగుల మేర దాటే అవకాశం ఎక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క జులై నెలలోనే రెండుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి అంటున్నారు.

kunavaram bridge

Advertisement

తాజా వార్తలు

Advertisement